ప|| ఏమరక తలచరో యిదే చాలు | కామించినవియెల్ల గక్కున కలుగు ||
చ|| దురితములెల్ల దీరు దుఃఖములెల్ల నణుగు | హరియని వొకమాటు అన్నాజాలు |
సురలు పూజింతురు సిరులెల్ల జేరును | మరుగురుని నామమటు పేరుకొన్నజాలు ||
చ|| భవములన్నియుబాయు పరము నిహముజేరు | ఆవల నారాయణ యన్నాజాలు |
భువి యెల్లా దానేలు పుణ్యములన్నియు జేరు | తవిలి గోవిందునాత్మ దరచిన జాలు ||
చ|| ఆనందము గలుగు నజ్ఞానమెల్లబాయు | ఆనుక శ్రీ వేంకటేశ యన్నాజాలు |
యీనెపాన నారదాదులిందరు నిందకు సాక్షి | దానవారి మంత్ర జపతపమే చాలు ||
pa|| Emaraka talacarO yidE cAlu | kAmiMcinaviyella gakkuna kalugu ||
ca|| duritamulella dIru duHKamulella naNugu | hariyani vokamATu annAjAlu |
suralu pUjiMturu sirulella jErunu | maruguruni nAmamaTu pErukonnajAlu ||
ca|| BavamulanniyubAyu paramu nihamujEru | Avala nArAyaNa yannAjAlu |
Buvi yellA dAnElu puNyamulanniyu jEru | tavili gOviMdunAtma daracina jAlu ||
ca|| AnaMdamu galugu naj~jAnamellabAyu | Anuka SrI vEMkaTESa yannAjAlu |
yInepAna nAradAduliMdaru niMdaku sAkShi | dAnavAri maMtra japatapamE cAlu ||