ప|| ఏమి సేయగవచ్చు నీశ్వరాధీనంబు | తామసపుబుద్ధి కంతలు దూరవలనె ||
చ|| తెగి దురాపేక్షబడ తివియు గతిలేదుగన | పగగొన్న వగలకూపముల బడవలసె |
తగుమోహసలిలంబు దాట మతిలేదుగన | మగుడబడి భవముతో మల్లాడవలసె ||
చ|| పాపకర్మముల జంపగ శక్తిలేదుగన | కోపబుద్ధులచేత కొరమాలవలసె |
రూపములు బొడగాంచి రోయ దరిలేదుగన | తాపములచే బొరలి తగులుగావలసె ||
చ|| తిరువేంకటాచలాధిపు గొలువలేదుగన | గరిమిచెడి విషయకింకరుడు గావలనె |
పరతత్త్వమూర్తి దలపగ బ్రొద్దులేదుగన | దొరతనం బుడిగి యాతురుడు గావలసె ||
pa|| Emi sEyagavaccu nISvarAdhInaMbu | tAmasapubuddhi kaMtalu dUravalane ||
ca|| tegi durApEkShabaDa tiviyu gatilEdugana | pagagonna vagalakUpamula baDavalase |
tagumOhasalilaMbu dATa matilEdugana | maguDabaDi BavamutO mallADavalase ||
ca|| pApakarmamula jaMpaga SaktilEdugana | kOpabuddhulacEta koramAlavalase |
rUpamulu boDagAMci rOya darilEdugana | tApamulacE borali tagulugAvalase ||
ca|| tiruvEMkaTAcalAdhipu goluvalEdugana | garimiceDi viShayakiMkaruDu gAvalane |
paratattvamUrti dalapaga broddulEdugana | doratanaM buDigi yAturuDu gAvalase ||