ప|| ఏమిసేతువు దేవదేవ యింతయును నీమాయ | కామినుల జూచిచూచి కామించె భవము ||
చ|| చంచలపు గనుదోయి సతులబారికి జిక్కి | చంచలమందెను నాదిచ్చరిమనసు |
కంచుగుత్తికలవారి గానములజొక్కిచొక్కి | కంచుబెంచునాయబో నాకడలేనిగుణము ||
చ|| తీపులమాటల మించి తెరవలభ్రమ దరి- | తీపులపాలాయబో నాతెలివెల్లాను |
పూపలనవ్వులతోడి పొలతుల జూచిచూచి | పూపలుబిందెలునై పొల్లువోయ దపము ||
చ|| కూటమి సతులపొందు కోరికోరి కూడికూడి | కూటువ నావిరతెందో కొల్లబోయను |
నీటున శ్రీవేంకటేశ నినుగని యింతలోనె | జూటరినై యింతలోనె సుజ్ఞానినైతి ||
pa|| EmisEtuvu dEvadEva yiMtayunu nImAya | kAminula jUcicUci kAmiMce Bavamu ||
ca|| caMcalapu ganudOyi satulabAriki jikki | caMcalamaMdenu nAdiccarimanasu |
kaMcuguttikalavAri gAnamulajokkicokki | kaMcubeMcunAyabO nAkaDalEniguNamu ||
ca|| tIpulamATala miMci teravalaBrama dari- | tIpulapAlAyabO nAtelivellAnu |
pUpalanavvulatODi polatula jUcicUci | pUpalubiMdelunai polluvOya dapamu ||
ca|| kUTami satulapoMdu kOrikOri kUDikUDi | kUTuva nAvirateMdO kollabOyanu |
nITuna SrIvEMkaTESa ninugani yiMtalOne | jUTarinai yiMtalOne suj~jAninaiti ||