ప|| ఏమో తెలిసెగాని యీజీవుడు | నేమంపునెరవిద్య నేరడాయ ||
చ|| కపటాలె నేరిచెగానీ జీవుడు | యెపుడైనా నిజసుఖ మెరుగడాయ |
కపురులే చవిగొనెగానీ జీవుడు | అపరిమితామృత మానడాయ ||
చ|| కడలనే తిరిగీగానీ జీవుడు | నడుమ మొదలు జూచి నడవడాయ |
కడుపుకూటికే పోయీగానీ జీవుడు | చెడనిజీతముపొంత జేరడాయ ||
చ|| కనియు గానకపోయగానీ జీవుడు | దివము వేంకటపతి దెలియడాయ |
కనుమాయలనె చొక్కెగానీ జీవుడు | తనియ నిట్టే మంచిదరి జేరడాయ ||
pa|| EmO telisegAni yIjIvuDu | nEmaMpuneravidya nEraDAya ||
ca|| kapaTAle nEricegAnI jIvuDu | yepuDainA nijasuKa merugaDAya |
kapurulE cavigonegAnI jIvuDu | aparimitAmRuta mAnaDAya ||
ca|| kaDalanE tirigIgAnI jIvuDu | naDuma modalu jUci naDavaDAya |
kaDupukUTikE pOyIgAnI jIvuDu | ceDanijItamupoMta jEraDAya ||
ca|| kaniyu gAnakapOyagAnI jIvuDu | divamu vEMkaTapati deliyaDAya |
kanumAyalane cokkegAnI jIvuDu | taniya niTTE maMcidari jEraDAya ||