ప|| ఏరీతి నెవ్వరు నిన్ను నెట్టు భావించినాను | వారి వారి పాలికి వరదుడ వౌదువు ||
చ|| చేరి కొల్చినవారికి జేపట్టు గుంచమవు | కోరి నుతించువారి కొంగుపైడివి |
మేరతో దలచువారి మేటినిధానమవు | సారపు వివేకులకు సచ్చిదానందుడవు ||
చ|| కావలెనన్నవారికి కామధేనువు మరి | సేవ చేసేవారికి చింతామణివి |
నీవే గతన్నవారికి నిఖిల రక్షకుడవు | వావిరి శరణు వేడే వారికి భాగ్యరాశివి ||
చ|| నిన్ను బూజించేవారి నిజ పరతత్త్వమవు | యిన్నిటా నీదాసులకు నేలికవు |
యెన్నగ శ్రీవేంకటేశ యిహపరములకును | పన్ని కాచుకున్నవారి ఫలదాయకుడవు ||
pa|| ErIti nevvaru ninnu neTTu BAviMcinAnu | vAri vAri pAliki varaduDa vauduvu ||
ca|| cEri kolcinavAriki jEpaTTu guMcamavu | kOri nutiMcuvAri koMgupaiDivi |
mEratO dalacuvAri mETinidhAnamavu | sArapu vivEkulaku saccidAnaMduDavu ||
ca|| kAvalenannavAriki kAmadhEnuvu mari | sEva cEsEvAriki ciMtAmaNivi |
nIvE gatannavAriki niKila rakShakuDavu | vAviri SaraNu vEDE vAriki BAgyarASivi ||
ca|| ninnu bUjiMcEvAri nija paratattvamavu | yinniTA nIdAsulaku nElikavu |
yennaga SrIvEMkaTESa yihaparamulakunu | panni kAcukunnavAri PaladAyakuDavu ||