ప|| ఏవీ నుపాయాలుగావు యెక్కువ భక్తేకాని | దావతి బడక యిది దక్కితే సులభము ||
చ|| ముంటిపై సుఖమందుట ముక్కున నూరుపువట్టి | దంటవాయువు గెలువదలచేదెల్లా |
వెంటికవట్టుక పోయి వెస గొండ వాకుట | వెంట గర్మమార్గమున విష్ణుని సాధించుట ||
చ|| యేనుగుతో బెనగుట యిల నిరాహారియై | కాననిపంచేందిర్యాల గట్టబోవుట |
నానిం చినుపగుగిళ్ళు నమలుట బలిమిని | ధ్యానించి మనసుబట్టి దైవము సాధించుట ||
చ|| దప్పికి నెండమావులు దాగ దగ్గరబోవుట | తప్పుజదువులలో దత్త్వము నెంచుట |
పిప్పిచవి యడుగుట పెక్కుదైవాల గొలిచి | కప్పిన శ్రీవేంకటేశుకరుణ సాధించుట ||
pa|| EvI nupAyAlugAvu yekkuva BaktEkAni | dAvati baDaka yidi dakkitE sulaBamu ||
ca|| muMTipai suKamaMduTa mukkuna nUrupuvaTTi | daMTavAyuvu geluvadalacEdellA |
veMTikavaTTuka pOyi vesa goMDa vAkuTa | veMTa garmamArgamuna viShNuni sAdhiMcuTa ||
ca|| yEnugutO benaguTa yila nirAhAriyai | kAnanipaMcEMdiryAla gaTTabOvuTa |
nAniM cinupagugiLLu namaluTa balimini | dhyAniMci manasubaTTi daivamu sAdhiMcuTa ||
ca|| dappiki neMDamAvulu dAga daggarabOvuTa | tappujaduvulalO dattvamu neMcuTa |
pippicavi yaDuguTa pekkudaivAla golici | kappina SrIvEMkaTESukaruNa sAdhiMcuTa ||