ప|| ఎవ్వడోకాని యెరుగరాదు కడు | దవ్వులనే వుండు తలపులో నుండు ||
చ|| యెదయవు తనరెక్క లెగసి పోలేడు | కడు దాగుగాని దొంగయు గాడు |
వడి గిందుపడును సేవకుడునుగాడు | వెడగుగోళ్ళు వెంచు విటుడును గాడు ||
చ|| మిగుల బొట్టివాడు మింటికిని బొడవు | జగడాలు తపసి వేషములును |
మగువకై పోరాడు మరి విరక్తుండును | తగు గాపుబనులు నెంతయు దెల్లదనము ||
చ|| తరుణుల వలపించు దగిలి పైకొనడు | తురగము దోలు రౌతునుగాడు |
తిరువేంకటాద్రిపై పరగు నెప్పుడును | పరమమూర్తియై పరగు నీఘనుడు ||
pa|| evvaDOkAni yerugarAdu kaDu | davvulanE vuMDu talapulO nuMDu ||
ca|| yedayavu tanarekka legasi pOlEDu | kaDu dAgugAni doMgayu gADu |
vaDi giMdupaDunu sEvakuDunugADu | veDagugOLLu veMcu viTuDunu gADu ||
ca|| migula boTTivADu miMTikini boDavu | jagaDAlu tapasi vEShamulunu |
maguvakai pOrADu mari viraktuMDunu | tagu gApubanulu neMtayu delladanamu ||
ca|| taruNula valapiMcu dagili paikonaDu | turagamu dOlu rautunugADu |
tiruvEMkaTAdripai paragu neppuDunu | paramamUrtiyai paragu nIGanuDu ||