ప|| ఎవ్వరికైనను యివ్రాత నను | నవ్వులు సేసెబో నావ్రాత ||
చ|| తొలిజన్మంబున దోషకారియై | నలుగడ దిప్పెను నావ్రాత |
యిల దుర్గుణముల కీజన్మంబున- | నలకువ సేసెబో నావ్రాత ||
చ|| పురుషుని జేసల్పుని ననిపించుట | నరజన్మమునకు నావ్రాత |
తరుచయ్యినైపాతక మరుపెట్టుక | నరకము చూపెబో నావ్రాత ||
చ|| పామఱితనమున బహువేదనలను | నామ సెనసెబో నావ్రాత |
కామితఫలు వేంకటపతిని గొలిచి | నామతి దెలిపెబో నావ్రాత ||
pa|| evvarikainanu yivrAta nanu | navvulu sEsebO nAvrAta ||
ca|| tolijanmaMbuna dOShakAriyai | nalugaDa dippenu nAvrAta |
yila durguNamula kIjanmaMbuna- | nalakuva sEsebO nAvrAta ||
ca|| puruShuni jEsalpuni nanipiMcuTa | narajanmamunaku nAvrAta |
tarucayyinaipAtaka marupeTTuka | narakamu cUpebO nAvrAta ||
ca|| pAmarxitanamuna bahuvEdanalanu | nAma senasebO nAvrAta |
kAmitaPalu vEMkaTapatini golici | nAmati delipebO nAvrAta ||