ప|| ఓరుచుకోవే యెట్టయినా వువిద నీవు | నేరుపరి నీ విభుడు నేడే వచ్చీ నీడకు ||
చ|| కలువల వేసితేనే కాముడు చుట్టము గాడా | వెలయు విరహులకు వెగటు గాక |
చలివెన్నెల గాసితే చందురుడు పగవాడా | పొలయలు కలవారే పొగడరుగాక ||
చ|| కొసరుచు బాడితేనే కోయిల గుండె బెదరా | అసదు విరహులు కాదందురు గాక |
ముసరితే దుమ్మిద మూకలు దయలేనివా | విసిగిన కాముకులే వినలేరు గాక ||
చ|| వనము సింగారించితే వసంతుడు కౄరుడా | వొనరని విరహుల కొంటదుగాక |
యెనసి శ్రీ వేంకటేశుడేలె నిన్ను చిలుకలు | కినిసేనా పాంథులకు కేరడముగాక ||
pa|| OrucukOvE yeTTayinA vuvida nIvu | nErupari nI viBuDu nEDE vaccI nIDaku ||
ca|| kaluvala vEsitEnE kAmuDu cuTTamu gADA | velayu virahulaku vegaTu gAka |
calivennela gAsitE caMduruDu pagavADA | polayalu kalavArE pogaDarugAka ||
ca|| kosarucu bADitEnE kOyila guMDe bedarA | asadu virahulu kAdaMduru gAka |
musaritE dummida mUkalu dayalEnivA | visigina kAmukulE vinalEru gAka ||
ca|| vanamu siMgAriMcitE vasaMtuDu kRUruDA | vonarani virahula koMTadugAka |
yenasi SrI vEMkaTESuDEle ninnu cilukalu | kinisEnA pAMthulaku kEraDamugAka ||