చాలదా హరి నామ
రాగము : హమ్సధ్వని
ప|| చాలదా హరి నామ సౌఖ్యామృతము దమకు | చాలదా హితవైన చవులెల్లను నొసగ ||
చ|| ఇది యొకటి హరి నామ మింతైన జాలదా | చెదరకీ జన్మముల చెరలు విడిపించ |
మదినొకటె హరినామ మంత్రమది చాలదా | పదివేల నరక కూపముల వెడలించ ||
చ|| కలదొకటి హరినామ కనకాద్రి చాలదా | తొలగుమని దారిద్ర్యదోషంబు చెరుచ |
తెలివొకటి హరినామదీప మది చాలదా | కలుషంపు కఠిన చీకటి పారద్రోల ||
చ|| తగువేంకటేశు కీర్తనమొకటి చాలదా | జగములో కల్పభూజంబు వలె నుండ |
సొగసి యీవిభుని దాసుల కరుణ చాలదా | నగవు జూపులను నున్నతమెపుడు జూప ||
pa|| cAladA hari nAma sauKyAmRutamu damaku | cAladA hitavaina cavulellanu nosaga ||
ca|| idi yokaTi hari nAma miMtaina jAladA | cedarakI janmamula ceralu viDipiMca |
madinokaTe harinAma maMtramadi cAladA | padivEla naraka kUpamula veDaliMca ||
ca|| kaladokaTi harinAma kanakAdri cAladA | tolagumani dAridryadOShaMbu ceruca |
telivokaTi harinAmadIpa madi cAladA | kaluShaMpu kaThina cIkaTi pAradrOla ||
ca|| taguvEMkaTESu kIrtanamokaTi cAladA | jagamulO kalpaBUjaMbu vale nuMDa |
sogasi yIviBuni dAsula karuNa cAladA | nagavu jUpulanu nunnatamepuDu jUpa ||
Sung by:Shobha raju
|