pa:
గతులన్ని ఖిలమైన కలియుగమందును |
గతి ఈతడే చూపె ఘన గురుదైవము ||
ca 1:
ఈతని కరుణనేకా ఇలవైష్ణవుల మైతి |
మీతని వల్లనే కంటి మీ తిరుమణి |
ఈతడే ఉపదేశమిచ్చెను అష్టాక్షరి మంత్రము |
ఈతడే రామానుజులు ఇహపర దైవము ||
ca 2:
వెలయించె నీతడేకా వేదపు రహస్యములు |
చలిమి నీతడే చూపె శరణాగతి |
నిలిపినాడీతడే కా నిజముద్రా ధారణము |
మలసి రామానుజులు మాటలాడే దైవము ||
ca 3:
నియమములు ఈతడేకా నిలిపె ప్రపన్నులకు |
దయతో మోక్షము చూపె తగనీతడు |
నయమై శ్రీవేంకటేశు నగమెక్కె వాకిటను |
దయచూచి మమ్మునిట్టే తల్లిదండ్రి ||
pa:
gatulanni khilamaina kaliyugamaMdunu |
gati iitaDE chuupe ghana gurudaivamu ||
ca 1 :
iitani karuNanEkaa ilavaishNavula maiti |
miitani vallanE kaMTi mii tirumaNi |
iitaDE upadESamichchenu ashTAkshari maMtramu |
iitaDE raamaanujulu ihapara daivamu ||
ca 2:
velayiMche niitaDEkaa vEdapu rahasyamulu |
chalimi niitadE chuupe Saranaagati |
nilipinaaDiitaDE kaa nijamudraa dhaaraNamu |
malasi raamaanujulu maaTalADE daivamu ||
ca 3 :
niyamamulu iitaDEkaa nilipe prapannulaku |
dayatO mOkShamu chUpe taganiitaDu |
nayamai SriiVEMkaTESu nagamekke vaakiTanu |
dayachuuchi mammuniTTE tallidaMDri daivamu ||
Sung by:Balakrishna Prasad
|