ప|| నీయంతటివారెవ్వరు నీకు నెదురేది యెందు | చాయల నీసుద్ది విని శరణంటినేను ||
చ|| కావలెనంటే దొల్లి కంభము చించుకవెళ్ళి | కైవశమై ప్రహ్లాదు గావవా నీవు |
తేవలనంటె బ్రహ్మదేవునికి వేదములు | సోవల సముద్రమయిన చొచ్చి తేవానీవు ||
చ|| పట్టియెత్తవలెనంటే బాతాళాన బడ్డకొండ | తట్టియెత్తి పాలవెల్లి దచ్చవా నీవు |
మట్టుపెట్టవలె నంటే మరిభూమి చాపగాగ | చుట్టుకపోతే దెచ్చి సొంపుగ నిలుపవా ||
చ|| పక్షపామయ్యేనంటే బాండవుల గెలుపించి | యోక్షితి నేలించి చనవియ్యవా నీవు |
రక్షించేనంటే గాచరావ శ్రీవేంకటాద్రి బ్ర- | త్యక్షమై మావంటివారి దగ గరుణించవా ||
pa|| nIyaMtaTivArevvaru nIku nedurEdi yeMdu | cAyala nIsuddi vini SaraNaMTinEnu ||
ca|| kAvalenaMTE dolli kaMBamu ciMcukaveLLi | kaivaSamai prahlAdu gAvavA nIvu |
tEvalanaMTe brahmadEvuniki vEdamulu | sOvala samudramayina cocci tEvAnIvu ||
ca|| paTTiyettavalenaMTE bAtALAna baDDakoMDa | taTTiyetti pAlavelli daccavA nIvu |
maTTupeTTavale naMTE mariBUmi cApagAga | cuTTukapOtE decci soMpuga nilupavA ||
ca|| pakShapAmayyEnaMTE bAMDavula gelupiMci | yOkShiti nEliMci canaviyyavA nIvu |
rakShiMcEnaMTE gAcarAva SrIvEMkaTAdri bra- | tyakShamai mAvaMTivAri daga garuNiMcavA ||