ప|| సంసారమే మేలు సకల జనులకును | కంసాంతకుని భక్తిగలిగితే మేలు ||
చ|| వినయంపు మాటల విద్య సాధించితే మేలు | తనిసి యప్పులలోన దాగకుంటే మేలు |
మునుపనే భుమి దన్నుమోచి దించకుంటే మేలు | వెనుకొన్నకోపము విడచితే మేలు ||
చ|| కొరివొకరి నడిగి కొంచపడకుంటే మేలు | సారె సారె జీవులను చంపకుంటే మేలు |
భరపుటిడుమలను పడకుండితే మేలు | కారించి తిట్ల కొడిగట్టకుంటే మేలు ||
చ|| పరకాంతల భంగపరచకుంటే మేలు | దొరకని కెళవులు దొక్కకుంటే మేలు |
అరుదైన శ్రీ వేంకటాద్రి విభుని గొల్చి | యిరవై నిశ్చింతుడైతే నిన్నిటాను మేలు ||
pa|| saMsAramE mElu sakala janulakunu | kaMsAMtakuni BaktigaligitE mElu ||
ca|| vinayaMpu mATala vidya sAdhiMcitE mElu | tanisi yappulalOna dAgakuMTE mElu |
munupanE Bumi dannumOci diMcakuMTE mElu | venukonnakOpamu viDacitE mElu ||
ca|| korivokari naDigi koMcapaDakuMTE mElu | sAre sAre jIvulanu caMpakuMTE mElu |
BarapuTiDumalanu paDakuMDitE mElu | kAriMci tiTla koDigaTTakuMTE mElu ||
ca|| parakAMtala BaMgaparacakuMTE mElu | dorakani keLavulu dokkakuMTE mElu |
arudaina SrI vEMkaTAdri viBuni golci | yiravai niSciMtuDaitE ninniTAnu mElu ||