ప|| వైష్ణవులుగానివార లెవ్వరు లేరు | విష్ణుప్రభావ మీవిశ్వమంతయు గాన ||
చ|| అంతయు విష్ణుమయంబట మరి దేవ- | తాంతరములు గలవనేలా |
భ్రాంతి బొంది యీభావము భావించి- | నంతనే పుణ్యులౌట దప్పదుగాన ||
చ|| యెవ్వరి గొలిచిన నేమిగొరత మరి | యెవ్వరి దలచిన నేమి |
ఆవ్వలివ్వల శ్రీహరిరూపు గానివా- | రెవ్వరు లేరని యెరుకదోచిన జాలు ||
చ|| అతిచంచలంబై నయాతును గలిగించు- | కతమున బహుచిత్తగతులై |
యితరుల గొలిచైన యెదాయక యనాథ- | పతివేంకటపతి చేకొనుగాక ||
pa|| vaiShNavulugAnivAra levvaru lEru | viShNupraBAva mIviSvamaMtayu gAna ||
ca|| aMtayu viShNumayaMbaTa mari dEva- | tAMtaramulu galavanElA |
BrAMti boMdi yIBAvamu BAviMci- | naMtanE puNyulauTa dappadugAna ||
ca|| yevvari golicina nEmigorata mari | yevvari dalacina nEmi |
Avvalivvala SrIharirUpu gAnivA- | revvaru lErani yerukadOcina jAlu ||
ca|| aticaMcalaMbai nayAtunu galigiMcu- | katamuna bahucittagatulai |
Yitarula golicaina yedAyaka yanAtha- | pativEMkaTapati cEkonugAka ||