ప|| అయ్యో మానుపగదవయ్య మనుజుడు తన- | కయ్యపుగంట గానడు ||
చ|| పాపపుణ్యలంపటుడైనా దుష్ట- | రూపుడూ జన్మరోగి యటుగాన |
పైపైనే ద్రవ్యతాపజ్వరము వుట్టి | యేపొద్దు వొడలెరగడు ||
చ|| నరకభవనపరిణతుడైనా కర్మ- | పురుషుడు హేయభోగి యటుగాన |
దురితపుణ్యత్రిదోషజ్వరము వట్టి | అరవెరమాట లాడీనీ ||
చ|| దేహమోహసుస్థిరుడై నా ని- | ర్వాహుడు తర్కవాది యటుగాన |
శ్రీహరి వేంకటశ్రీకాంతుని గని | వూహల జేరనొల్లడు ||
pa|| ayyO mAnupagadavayya manujuDu tana- | kayyapugaMTa gAnaDu ||
ca|| pApapuNyalaMpaTuDainA duShTa- | rUpuDU janmarOgi yaTugAna |
paipainE dravyatApajvaramu vuTTi | yEpoddu voDaleragaDu ||
ca|| narakaBavanapariNatuDainA karma- | puruShuDu hEyaBOgi yaTugAna |
duritapuNyatridOShajvaramu vaTTi | araveramATa lADInI ||
ca|| dEhamOhasusthiruDai nA ni- | rvAhuDu tarkavAdi yaTugAna | SrIhari vEMkaTaSrIkAMtuni gani | vUhala jEranollaDu ||