ప|| ఎన్నాళ్ళున్నా నిట్టె కదా | విన్నని వెరగులె వేడుకలాయె ||
చ|| భువి నెట్టున్నా బోయేదే కా | చవులకు జవియగు శరీరము |
ధ్రువమని యీ సుఖ దుఃఖ రోగములు | భవముల కిదియే బందములాయె ||
చ|| ఎంత వొరలినా నిదే తాగద | కంతల కంతల కాయమిది |
బొంత దగలుచుక పొరలగ బొరలగ | సంత కూటములె సరసములాయె ||
చ|| కైపుసేసినా ఘనమౌనే కా | పాపము బుణ్యము బైపై నే |
యీ పుట్టుగునకు ఈ వేంకటపతి | దీపించగ బెను దెరువొకటాయె ||
pa|| ennALLunnA niTTe kadA | vinnani veragule vEDukalAye ||
ca|| Buvi neTTunnA bOyEdE kA | cavulaku javiyagu SarIramu |
dhruvamani yI suKa duHKa rOgamulu | Bavamula kidiyE baMdamulAye ||
ca|| eMta voralinA nidE tAgada | kaMtala kaMtala kAyamidi |
boMta dagalucuka poralaga boralaga | saMta kUTamule sarasamulAye ||
ca|| kaipusEsinA GanamaunE kA | pApamu buNyamu baipai nE |
yI puTTugunaku I vEMkaTapati | dIpiMcaga benu deruvokaTAye ||