ప|| సింగారమూరితివి చిత్తజు గురుడవు | చక్కగ జూచేరు మిము సాసముఖా ||
చ|| పూవుల తెప్పలమీద పొలతులు నీవునెక్కి | పూవులు ఆకసము మోప పూచిచల్లుచు |
దేవదుందుభులు మ్రోయ దేవతలు కొలువగా | సావధానమగు నీకు సాసముఖా ||
చ|| అంగరంగవైభవాల అమరకామినులాడ | నింగినుండి దేవతలు నినుజూడగా |
సంగీత తాళవాద్య చతురతలు మెరయ | సంగడిదేలేటి నీకు సాసముఖా ||
చ|| పరగ కోనేటిలోన పసిడి మేడనుండి | అరిది యిందిరయు నీవు ఆరగించి |
గరిమ శ్రీవేంకటేశ కన్నుల పండువకాగ | సరవి నోలాడు సాసముఖా ||
pa|| siMgAramUritivi cittaju guruDavu | cakkaga jUcEru mimu sAsamuKA ||
ca|| pUvula teppalamIda polatulu nIvunekki | pUvulu Akasamu mOpa pUcicallucu |
dEvaduMduBulu mrOya dEvatalu koluvagA | sAvadhAnamagu nIku sAsamuKA ||
ca|| aMgaraMgavaiBavAla amarakAminulADa | niMginuMDi dEvatalu ninujUDagA |
saMgIta tALavAdya caturatalu meraya | saMgaDidElETi nIku sAsamuKA ||
ca|| paraga kOnETilOna pasiDi mEDanuMDi | aridi yiMdirayu nIvu AragiMci |
garima SrIvEMkaTESa kannula paMDuvakAga | saravi nOlADu sAsamuKA ||
Sung by:Balakrishna Prasad
|