ప|| అందరి కాధారమైన ఆదిపురుషు డీతడు | విందై మున్నారగించె విదురునికడ నీతడు ||
చ|| సనకాదులుగొనియాడెడిసర్వాత్మకు డీతడు | వనజభవాదులకును దైవంబై నతడీతడు |
యినమండలమున జెలగేటిహితవైభవు డీతడు | మునుపుట్టిన దేవతలకు మూలభూతి యీతడు ||
సిరులొసగి యశోదయింట శిశువైనత డీతడు | ధరనావులమందలో తగ జరించె నీతడు |
సరసతలను గొల్లెతలకు జనవులొసగె నీతడు | అరసి కుచేలునియడుకు లారగించె నీతడు ||
పంకజభవునకు బ్రహ్మపద మొసగెను యీతడు | సంకీర్తన లాద్యులచే జట్టిగొనియె నీతడు |
తెంకిగ నేకాలము బరదేవుడయున యీతడు | వేంకటగిరిమీద బ్రభల వెలసినఘను డీతడు ||
pa|| aMdari kAdhAramaina AdipuruShu DItaDu | viMdai munnAragiMce vidurunikaDa nItaDu ||
ca|| sanakAdulugoniyADeDisarvAtmaku DItaDu | vanajaBavAdulakunu daivaMbai nataDItaDu |
yinamaMDalamuna jelagETihitavaiBavu DItaDu | munupuTTina dEvatalaku mUlaBUti yItaDu ||
sirulosagi yaSOdayiMTa SiSuvainata DItaDu | dharanAvulamaMdalO taga jariMce nItaDu |
sarasatalanu golletalaku janavulosage nItaDu | arasi kucEluniyaDuku lAragiMce nItaDu ||
paMkajaBavunaku brahmapada mosagenu yItaDu | saMkIrtana lAdyulacE jaTTigoniye nItaDu |
teMkiga nEkAlamu baradEvuDayuna yItaDu | vEMkaTagirimIda braBala velasinaGanu DItaDu ||