Anisamu Talacharo Ahobalam - అనిశము దలచరో అహోబలం


ప|| అనిశము దలచరో అహోబలం | అనంత ఫలదం అహోబిలం ||

చ|| హరి నిజనిలయం అహోబలం | హరివిరించి నుత మహోబలం |

అరుణ మణి శిఖర మహోబలం | అరిదైత్యహరణ మహోబలం ||

చ|| అతిశయ శుభదం అహోబలం | అతుల మనోహర మహోబలం ||

హత దురితచయం అహోబలం | యతి మత సిద్ధం అహోబలం ||

చ|| అగు శ్రీవేంకట మహోబలం | అగమ్య మసురుల కహోబలం |

అగపడు పుణ్యుల కహోబలం | అగకుల రాజం అహోబలం ||

pa|| aniSamu dalacarO ahObalaM | anaMta PaladaM ahObilaM ||

ca|| hari nijanilayaM ahObalaM | hariviriMci nuta mahObalaM |

aruNa maNi SiKara mahObalaM | aridaityaharaNa mahObalaM ||

ca|| atiSaya SuBadaM ahObalaM | atula manOhara mahObalaM ||

hata duritacayaM ahObalaM | yati mata siddhaM ahObalaM ||

ca|| agu SrIvEMkaTa mahObalaM | agamya masurula kahObalaM |

agapaDu puNyula kahObalaM | agakula rAjaM ahObalaM ||


Anis-hamu-Thala-ch...