AragiMchi KurchunnaDallavaDe - ఆరగించి కూర్చున్నాడల్లవాడె



ఆరగించి కూర్చున్నాడల్లవాడె
చేరువనే చూడరె లక్ష్మీనారసింహుడు

ఇందిరను తొడమీద నిడుకొని కొలువిచ్చీ
అందపు నవ్వులు చల్లీనల్ల వాడె
చెందిన మాణికముల శేషుని పడెగె మీది
చెంది వరాలిచ్చీ లక్ష్మీనారసింహుడు

బంగారు మేడలోన పచ్చల గద్దియల మీద
అంగనల ఆట చూచి నల్ల వాడె
రంగగు సొమ్ముల తోడ రాజసపు విభవాల
చెంగట నున్నాడు లక్ష్మీ నారసింహుడు

పెండెపు పాదము చాచి పెనచి ఒక పాదము
అండనే పూజ గొనీ నల్లవాడె
కొండల శ్రీవేంకటాద్రి కోరి అహోబలమున
మెండుగాను మెరసీ లక్ష్మీనారసింహుడు


Aaraginchi Kurchun...