ప|| అతని పాడెదను అది వ్రతము | చతురుని శేషాచల నివాసుని ||
చ|| సనకాదులు ఏ సర్వేశు గొలిచిరి | అనిశము శుకుడెవ్వని దలచె |
మును ధ్రువు డేదేవుని సన్నుతించె | ఘన నారదు డేఘనుని పొగడెను ||
చ|| ఎలమి విభీషణు డేదేవుని శరణని | తలచె భీష్ముడే దైవమును |
బలు ప్రహ్లాదుని ప్రాణేశు డెవ్వడు | ఇలలో వశిష్ఠు డేమూర్తి దెలిసె ||
చ|| పురిగొని వ్యాసు డేపురుషుని చెప్పెను | తిరముగ అర్జునుని దిక్కెవ్వడు |
మరిగిన అలమేలమంగపతి ఎవ్వడు | గరిమల శ్రీవేంకటేశు డీతడు ||
ca|| sanakAdulu E sarvESu goliciri | aniSamu SukuDevvani dalace |
munu dhruvu DEdEvuni sannutiMce | Gana nAradu DEGanuni pogaDenu ||
ca|| elami viBIShaNu DEdEvuni SaraNani | talace BIShmuDE daivamunu |
balu prahlAduni prANESu DevvaDu | ilalO vaSiShThu DEmUrti delise ||
ca|| purigoni vyAsu DEpuruShuni ceppenu | tiramuga arjununi dikkevvaDu |
marigina alamElamaMgapati evvaDu | garimala SrIvEMkaTESu DItaDu ||