ప ఆదిమూర్తి యీతడు ప్రహ్లాదవరదుడు ఏదెస జూచినా తానె ఈతడిదె దేవుడు
చ నవ్వుల మోముతోడ నరసింహరూపుతోడ జవ్వని తొడమీద సరసమాడ
పువ్వుల దండలు ఇరుబుజాలపై వేసుకొని ఉవ్విళ్ళూర కొలువై వున్నాడు దేవుడు
చ సంకు చక్రములతోడ జమళికోరల తోడ అంకెల కటి అభయహస్తాలెత్తి
కంకణాల హారాలతో ఘనకిరీటము వెట్టి పొంకమైన ప్రతాపాన పొదలీని దేవుడు
చ నానా దేవతలతోడ నారదాదుల తోడ గానములు వినుకొంటా గద్దెపై నుండి
pa AdimUrti yItaDu prahlAdavaraduDu Edesa jUcinA tAne ItaDide dEvuDu
ca navvula mOmutODa narasiMharUputODa javvani toDamIda sarasamADa
puvvula daMDalu irubujAlapai vEsukoni uvviLLUra koluvai vunnADu dEvuDu
ca saMku cakramulatODa jamaLikOrala tODa aMkela kaTi aBayahastAletti
kaMkaNAla hArAlatO GanakirITamu veTTi poMkamaina pratApAna podalIni dEvuDu
ca nAnA dEvatalatODa nAradAdula tODa gAnamulu vinukoMTA gaddepai nuMDi
AdimUrti yItaDu prahlAdavaraduDu - ఆదిమూర్తి యీతడు ప్రహ్లాదవరదుడు
6:21 AM
A-Annamayya, ఆ