ఏమని వర్ణించునొకో ఇంక పురాణములెల్ల
వేమారు కొత్తలాయ విశ్వలోకపతికి
పాలజలనిధిలోన పలుమారు( దేలగాను
నీలవర్ణమెల్ల( బోయి నిండు తెలుపైనట్టు
మేలిమి కప్పురకాపు మేన నిండ( నించగాను
పోలికె వేరొక్కటాయ పురుషోత్తమునికి
వేడుక కాళింది లోన వేమారు నీదగాను
ఆడనే కమ్మర నలుపైనట్టు
తోడనే తట్టపుణుగు తొప్పదోగ నించగాను
జాడ వేరొక్కటాయ సర్వేశ్వరునికి
అలమేలుమంగ నురమందునే నిలుపగాను
అలరి బంగారువర్ణమైనట్టు
నలుగడ సొమ్ములతో నానావర్ణములు
నిలిచె శ్రీవేంకటనిలయమూరితికి
Emani varNiMchunokO iMka purANamulella
vEmAru kottalAya viSwalOkapatiki
pAlajalanidhilOna palumAru( dElagAnu
nIlavarNamella( bOyi niMDu telupainaTTu
mElimi kappurakApu mEna niMDa( niMchagAnu
pOlike vErokkaTAya purushOttamuniki
vEDuka kALiMdi lOna vEmAru nIdagAnu
ADanE kammara nalupainaTTu
tODanE taTTapuNugu toppadOga niMchagAnu
jADa vErokkaTAya sarwESwaruniki
alamElumaMga nuramaMdunE nilupagAnu
alari baMgAruvarNamainaTTu
nalugaDa sommulatO nAnAvarNamulu
niliche SrIvEMkaTanilayamUritiki