ఎన్నడొకో సుజ్ఞానము యీ యాత్మకు
కన్ను లెదిటివి చూచి కాలము నిట్టాయను
హేయములో సుఖము యెంగిలిలో సుఖము
కాయము నమ్మికదా కష్టపడెను
పాయములో చవులు పాపములో చవులు
మాయలు నమ్మికదా మనసూనిట్టాయను
కల్లలోనిబదుకు కాసువీసపుబదుకు
కల్లరి ప్రాణాలు నమ్మి కట్టుపడెను
యెల్లి నేటి తలపు యింద్రియాల తలపు
కొల్ల సంసారముగూడి గుణమునిట్టాయను
అంగడిబెట్టే సిరులు యలయింపులో సిరులు
దొంగజీవుడు యిట్లానే తొట్రుపడెను
అంగపు శ్రీవేంకటేశుడంతలో మన్నించగాను
ముంగిలెల్లా మోక్షమాయ ముచ్చటే యిట్టాయెను
ennaDokO suj~nAnamu yI yAtmaku
kannu lediTivi chUchi kAlamu niTTAyanu
hEyamulO sukhamu yeMgililO sukhamu
kAyamu nammikadA kaShTapaDenu
pAyamulO chavulu pApamulO chavulu
mAyalu nammikadA manasUniTTAyanu
kallalOnibaduku kAsuvIsapubaduku
kallari prANAlu nammi kaTTupaDenu
yelli nETi talapu yiMdriyAla talapu
kolla saMsAramugUDi guNamuniTTAyanu
aMgaDibeTTE sirulu yalayiMpulO sirulu
doMgajIvuDu yiTlAnE toTrupaDenu
aMgapu SrIvEMkaTESuDaMtalO manniMchagAnu
muMgilellA mOkshamAya muchchaTE yiTTAyenu