ప|| ఎంతగాలమొకదా యీదేహధారణము |
చింతాపరంపరల జిక్కువడవలసె ||
చ|| వడిగొన్న మోహంబువలల దగులైకదా |
కడలేని గర్భనరకము లీదవలసె |
నడిమిసుఖములచేత ననువుసేయగగదా |
తొడరి హేయపుదిడ్డి దూరాడవలసె ||
చ|| పాపపుంజములచే బట్టువడగాగదా |
ఆపదలతోడిదేహము మోవవలసె |
చూపులకులోనైన సుఖము గానకకదా |
దీపనభ్రాంతిచే దిరిగాడవలసె ||
చ|| హితుడైనతిరువేంకటేశు గొలువకకదా |
ప్రతిలేనినరక కూపమున బడవలసె |
ఆతనికరుణారసం బబ్బకుండగగదా |
బతిమాలి నలుగడల బారాడవలసె ||
pa|| eMtagAlamokadA yIdEhadhAraNamu |
ciMtAparaMparala jikkuvaDavalase ||
ca|| vaDigonna mOhaMbuvalala dagulaikadA |
kaDalEni garBanarakamu lIdavalase |
naDimisuKamulacEta nanuvusEyagagadA |
toDari hEyapudiDDi dUrADavalase ||
ca|| pApapuMjamulacE baTTuvaDagAgadA |
ApadalatODidEhamu mOvavalase |
cUpulakulOnaina suKamu gAnakakadA |
dIpanaBrAMticE dirigADavalase ||
ca|| hituDainatiruvEMkaTESu goluvakakadA |
pratilEninaraka kUpamuna baDavalase |
AtanikaruNArasaM babbakuMDagagadA |
batimAli nalugaDala bArADavalase ||
|