గోవిందా మేల్కొనవయ్యా
కావించి భోగము కడమా నీకు
కమలజ చల్లని కాగిట తగిలి
సమరతి పాయగ జాలవూ
కమలభవాదులు కడు నుతియింపగ
విమలపు శయనము విడువగలేవు
భూసతి తోడుత పొందులు మరిగి - వేసర విదె నీ వేడుకలా
వాసవ ముఖ్యులు వాకిట నుండగ - పాసివుండ నని పవళించేవు
నీళామనసిజ లీలలు తగిలి - నాలితోడ మానగలేవు
వేళాయెను శ్రీవేంకటనాథుడ - పాలించి దాసుల బ్రతికించగను
-
gOviMdA mElkonavayyA
kAviMchi bhOgamu kaDamA nIku
kamalaja challani kAgiTa tagili
samarati pAyaga jAlavU
kamalabhavAdulu kaDu nutiyiMpaga
vimalapu Sayanamu viDuvagalEvu
bhUsati tODuta poMdulu marigi
vEsara vide nI vEDukalA
vAsava mukhyulu vAkiTa nuMDaga
pAsivuMDa nani pavaLiMchEvu
nILAmanasija lIlalu tagili
nAlitODa mAnagalEvu
vELAyenu SrIvEMkaTanAthuDa
pAliMchi dAsula bratikiMchaganu