ప|| ఇంతకంటే ఘనమిక లేదు | సంతత సౌఖ్యము జనార్దననుడే ||
చ|| భయ నివారణము పరమాత్ముని స్తుతి | జయ కారణ మీశ్వర చింత |
అయుత పుణ్యఫల మచ్యుతుని సేవ | క్రియతో నిజమెరిగిన వారికి ||
చ|| కర్మహరము శ్రీకాంతు దరిసనము | ధర్మరాసి మాధవు శరణు |
అర్మిలి సంపద లనంతుని తగులు | నిర్మలముగ పూనిన దాసులకు ||
చ|| ఆగమోక్తమీ హరికైంకర్యము | భోగము విష్ణుని పూజ ఇది |
యోగము శ్రీవేంకటోత్తముని కొలువు | బాగులు నేర్చిన ప్రపన్నులకు ||
pa|| iMtakaMTE Ganamika lEdu | saMtata sauKyamu janArdananuDE ||
ca|| Baya nivAraNamu paramAtmuni stuti | jaya kAraNa mISvara ciMta |
ayuta puNyaPala macyutuni sEva | kriyatO nijamerigina vAriki ||
ca|| karmaharamu SrIkAMtu darisanamu | dharmarAsi mAdhavu SaraNu |
armili saMpada lanaMtuni tagulu | nirmalamuga pUnina dAsulaku ||
ca|| AgamOktamI harikaiMkaryamu | BOgamu viShNuni pUja idi |
yOgamu SrIvEMkaTOttamuni koluvu | bAgulu nErcina prapannulaku ||
inthakante ghanamika ledu - ఇంతకంటే ఘనమిక లేదు
3:53 AM
I- Annamayya, ఇ