ఇతరములన్నియు నడమంత్రములే యెంచిచూచినను యింతాను
హితవగుబంధువుడు ఈశ్వరుడొక్కడే ఈతనిమరువకుమీ జీవాత్మ ||
భవకూపంబుల బడలెడినాడు పాయని బంధువుడు ఇతడొకడే
దివిస్వర్గంబున తేలెడినాడు తిరుగబాయకెపు డితడొకడే
నవనరకంబుల నలగెడినాదు నటనల బాయడితడొకడే
యివలనవల హృదయేశుడు విష్ణుడు ఈతని మరువకుమీ జీవాత్మా ||
పశుమృగాదుల వొడలెత్తినప్పుడు పాయని బందుగు డితడొకడే
విశదపు దుఃఖపువేళలనైనా విడువని బంధువుడితడొకడే
శిశువైనప్పుడు వృద్ధైనప్పుడు చిత్తపుబందుగుడితడొకడే
దశావతారపు విష్ణుడొక్కడే ఈతని తలచుమీ జీవాత్మా ||
భావజకేలిని జొక్కినప్పుడును ప్రాణబంధువుడు ఇతడొకడే
యీవల నావల యిహపరములలో నిన్నిటి బంధువుడితడొకడే
దైవము తానని శరణనీయెడు నను దగ్గరికాచెను ఇతడొకడే
శ్రీవేంకటగిరి నాయకుడితడే చేరి భజించుము జీవాత్మా ||
itaramulanniyu naDamaMtramulE yeMchichUchinanu yiMtAnu
hitavagubaMdhuvuDu ISvaruDokkaDE ItanimaruvakumI jIvAtma ||
bhavakUpaMbula baDaleDinADu pAyani baMdhuvuDu itaDokaDE
diviswargaMbuna tEleDinADu tirugabAyakepu DitaDokaDE
navanarakaMbula nalageDinAdu naTanala bAyaDitaDokaDE
yivalanavala hRdayESuDu viShNuDu Itani maruvakumI jIvAtmA ||
paSumRgAdula voDalettinappuDu pAyani baMdugu DitaDokaDE
viSadapu du@hkhapuvELalanainA viDuvani baMdhuvuDitaDokaDE
SiSuvainappuDu vRddhainappuDu chittapubaMduguDitaDokaDE
daSAvatArapu viShNuDokkaDE Itani talachumI jIvAtmA ||
bhAvajakElini jokkinappuDunu prANabaMdhuvuDu itaDokaDE
yIvala nAvala yihaparamulalO ninniTi baMdhuvuDitaDokaDE
daivamu tAnani SaraNaniiyeDu nanu daggarikAchenu itaDokaDE
SrIvEMkaTagiri nAyakuDitaDE chEri bhajiMchumu jIvAtmA ||