ఇతనికంటె ఘనులికలేరు
యితరదేవతల నిందరిలోన
భూపతి యితడే పొదిగి కొలువరో
శ్రీపతి యితడే చేకొనరో
యేపున బలువుడు నీతడే చేరరో
పైపై వేంకటపతి యైనాడు
మరుగురుడితడే మతినమ్మగదరో
పరమాత్ముడితడె భావించరో
కరివరదుడితడె గతియని తలచరో
పరగ శ్రీవేంకటాపతి యైనాడూ
తల్లియునితడె తండ్రియు నితడే
వెల్లవిరై యిక విడువకురో
చల్లగా నితని శరణని బ్రతుకరో
అల్ల శ్రీవేంకటహరి యయినాడు
itanikaMTe ghanulikalEru
yitaradEvatala niMdarilOna
bhUpati yitaDE podigi koluvarO
SrIpati yitaDE chEkonarO
yEpuna baluvuDu nItaDE chErarO
paipai vEMkaTapati yainADu
maruguruDitaDE matinammagadarO
paramAtmuDitaDe bhAviMcharO
karivaraduDitaDe gatiyani talacharO
paraga SrIvEMkaTApati yainADU
talliyunitaDe taMDriyu nitaDE
vellavirai yika viDuvakurO
challagA nitani SaraNani bratukarO
alla SrIvEMkaTahari yayinADu
ithanikamte ghanulikaleru
3:04 AM
I- Annamayya, ఇ