ప|| ఇతనిప్రసాదమే యిన్నియును | గతి యితనిదేకన కాదనరాదు ||
చ|| కాయములో నొకఘనసంసారము | ప్రాయంబులతో బ్రబలీని |
ఆయ మందుకును హరి దానేయై | దాయక పాయక తగిలున్నాడు ||
చ|| వొనరినకలలో నొకసంసారము | మనసుతోడనే మలసీని |
ననిచి యందుకును నారాయణుడై | కొనమొదలై తా గురియైనాడు ||
చ|| వుడిబడి కోర్కుల నొకసంసారము | బడిబడియాసల బరగీని |
విడువక యిది శ్రీవేంకటేశ్వరుడే | తొడిబడ గల్పించి ధ్రువమయినాడు ||
pa|| itaniprasAdamE yinniyunu | gati yitanidEkana kAdanarAdu ||
ca|| kAyamulO nokaGanasaMsAramu | prAyaMbulatO brabalIni |
Aya maMdukunu hari dAnEyai | dAyaka pAyaka tagilunnADu ||
ca|| vonarinakalalO nokasaMsAramu | manasutODanE malasIni |
nanici yaMdukunu nArAyaNuDai | konamodalai tA guriyainADu ||
ca|| vuDibaDi kOrkula nokasaMsAramu | baDibaDiyAsala baragIni |
viDuvaka yidi SrIvEMkaTESvaruDE | toDibaDa galpiMci dhruvamayinADu ||
ithaniprasaadame yinniyunu
3:07 AM
I- Annamayya, ఇ