ప||
సకల శాంతికరము సర్వేశ నీపై భక్తి సర్వేశ ||
అనుప||
ప్రకటమై మాకునబ్బె బతికించు నిదియె సర్వేశ ||
చ||
మనసులో పాపబుద్ధి మరియెంత దలచిన |
నినుదలచినంతనే నీరౌను|
కనుగొన్న పాపములు కడలేనివైనను |
ఘనుడనిన్ను జూచితే కడకు దొలగును ||
చ||
చేతనంటిపాతకాలు సేనగానే చేసినాను |
ఆతల నీకు మ్రొక్కితే నన్నియు బాయు |
ఘాతలజెవుల వినగా నంటిన పాపము |
నీతితో నీ కథవింటే నిమిషాసబాయును ||
చ||
కాయమున జేసేటి కర్మపు పాపములెల్ల |
కాయవు నీ ముద్రలచే గ్రక్కున వీడు |
యేయెడ వేంకటేశ యేయేపాతకమైనా |
ఆయమైన నీ శరణాగతిచే నణగు ||
pa||
sakala SAMtikaramu sarvESa nIpai Bakti sarvESa ||
anupa||
prakaTamai mAkunabbe batikiMcu nidiye sarvESa ||
ca||
manasulO pApabuddhi mariyeMta dalacina |
ninudalacinaMtanE nIraunu|
kanugonna pApamulu kaDalEnivainanu |
GanuDaninnu jUcitE kaDaku dolagunu ||
ca||
cEtanaMTipAtakAlu sEnagAnE cEsinAnu |
Atala nIku mrokkitE nanniyu bAyu |
GAtalajevula vinagA naMTina pApamu |
nItitO nI kathaviMTE nimiShAsabAyunu ||
ca||
kAyamuna jEsETi karmapu pApamulella |
kAyavu nI mudralacE grakkuna vIDu |
yEyeDa vEMkaTESa yEyEpAtakamainA |
Ayamaina nI SaraNAgaticE naNagu ||
Sung by:Nedunuri KrishnaMurthy