ప||
సత్యభామ సరసపు నగవు | నిత్యము హరి మదినే నెలవు ||
చ||
రుకుమిణి దేవికి రూపయవ్వనికి | సకల విభవముల సౌఖ్యతలు |
చికురాంబరమున జెదరిన యలకలు | వికచాబ్జ ముఖము వెయి వేలాయె ||
చ||
తొడవుల శ్రీసతి తొలిమెరుగులమై | నడపులమురిపెపు నగుమోము |
తడయక వారిధి దచ్చిన హరికిని | బడలికవాపను పరమంబాయ ||
చ||
అనుదినమునును నీ యలుమేలుమంగ | కనుగవ జంకెన గర్వములు |
దినదినంబులును తిరువేంకటపతి | చనువుల సొబగుల సంపదలాయ ||
pa||
satyaBAma sarasapu nagavu | nityamu hari madinE nelavu ||
ca||
rukumiNi dEviki rUpayavvaniki | sakala viBavamula sauKyatalu |
cikurAMbaramuna jedarina yalakalu | vikacAbja muKamu veyi vElAye ||
ca||
toDavula SrIsati tolimerugulamai | naDapulamuripepu nagumOmu |
taDayaka vAridhi daccina harikini | baDalikavApanu paramaMbAya ||
ca||
anudinamununu nI yalumElumaMga | kanugava jaMkena garvamulu |
dinadinaMbulunu tiruvEMkaTapati | canuvula sobagula saMpadalAya ||
ఐవి. సీతాపతిగారి వ్యాఖ్యానం menaing provided by telugubhatki.com
Sung by:Asha Bhosle