అభయము అభయమో హరి నీవు | విభుడ వింతటికి వెర వికనేది ||
చ|| జడిగొని మదిలో శాంతము నిలువదు | కడుగడు దుస్సంగతి వలన |
ఇడుమలేని సుఖ మించుక గానము | ఆడియాసల నా-యలమట వలన ||
చ|| తలపులోన నీ తత్వము నిలువదు | పలులంపటముల భ్రమ వలన |
కలిగిన విజ్ఞాన గతియును దాగెను | వెలి విషయపు సిరివీకుల వలన ||
చ|| పక్కన పాపపు బంధము లూడెను | చిక్కక నిను దలచిన వలన |
చిక్కులు వాసెను శ్రీ వేంకటపతి | నిక్కము నాకిదే నీ కృప వలన ||
aBayamu aBayamO hari nIvu | viBuDa viMtaTiki vera vikanEdi ||
ca|| jaDigoni madilO SAMtamu niluvadu | kaDugaDu dussaMgati valana | iDumalEni suKa miMcuka gAnamu | ADiyAsala nA-yalamaTa valana ||
ca|| talapulOna nI tatvamu niluvadu | palulaMpaTamula Brama valana | kaligina vij~jAna gatiyunu dAgenu | veli viShayapu sirivIkula valana ||
ca|| pakkana pApapu baMdhamu lUDenu | cikkaka ninu dalacina valana | cikkulu vAsenu SrI vEMkaTapati | nikkamu nAkidE nI kRupa valana ||