ప|| అమరాంగనలదె నాడేరు | ప్రమదంబున నదె పాడేరు ||
చ|| గరుడ వాహనుడు కనక రథముపై | ఇరువుగ వీధుల నేగినీ |
సురులును మునులును సొంపుగ మోకులు | తెరలిచి తెరలిచి తీసేరు ||
చ|| ఇలధరు డదివో ఇంద్రరథముపై | కెలయచు దిక్కులు గెలిచేని |
బలు శేషాదులు బ్రహ్మ శివాదులు | చెలగి సేవలటు చేసేరు ||
చ|| అలమేల్మంగతో నటు శ్రీ వేంకట | నిలయుడు రథమున నెగడీని |
నలుగడ ముక్తులు నారదాదులును | పొలుపు మిగులగడు బొగడేరు ||
pa|| amarAMganalade nADEru | pramadaMbuna nade pADEru ||
ca|| garuDa vAhanuDu kanaka rathamupai | iruvuga vIdhula nEginI |
surulunu munulunu soMpuga mOkulu | teralici teralici tIsEru ||
ca|| iladharu DadivO iMdrarathamupai | kelayacu dikkulu gelicEni |
balu SEShAdulu brahma shivAdulu | celagi sEvalaTu cEsEru ||
ca|| alamElmaMgatO naTu SrI vEMkaTa | nilayuDu rathamuna negaDIni |
nalugaDa muktulu nAradAdulunu | polupu migulagaDu bogaDEru ||