ఆడరమ్మ పాడరమ్మ అంగనలు చూడరమ్మ | వేడుక పరషులెల్ల వీధి చూడరమ్మ ||
చ|| అల్లదివో ఓగునూతుల ఔభళేశు పెద్దకోన | వెల్లిపాల నీటి జాలు వెడలే సోన |
చల్లని మాకుల నీడ సంగడి మేడలవాడ | ఎల్లగాగ నరసింహుడేగీ నింతితోడ ||
చ|| సింగారపు మండపాల సింహాల మునిమందలు | అంగపు తెల్లగోపురము అదె మిన్నంద |
చెంగట నాళువార్లు చేరి పన్నిద్దరు గొల్వ | సంగతి తా కొలువిచ్చీ జయనరసింహము ||
చ|| కందువ శ్రీవేంకటేశు కల్యాణముల వేది | అందమై భూమికెల్ల ఆదికి అనాది |
మందల పాల కొండ మలకు నట్టనడుమ | విందగు దాసుల తోడ విహరించీ దేవుడు ||
ADaramma pADaramma aMganalu cUDaramma | vEDuka paraShulella vIdhi cUDaramma ||
ca|| alladivO OgunUtula auBaLESu peddakOna | vellipAla nITi jAlu veDalE sOna |
callani mAkula nIDa saMgaDi mEDalavADa | ellagAga narasiMhuDEgI niMtitODa ||
ca|| siMgArapu maMDapAla siMhAla munimaMdalu | aMgapu tellagOpuramu ade minnaMda | ceMgaTa nALuvArlu cEri panniddaru golva | saMgati tA koluviccI jayanarasiMhamu ||
ca|| kaMduva SrIvEMkaTESu kalyANamula vEdi | aMdamai BUmikella Adiki anAdi | maMdala pAla koMDa malaku naTTanaDuma | viMdagu dAsula tODa vihariMcI dEvuDu ||