ప|| అదె శిరశ్చక్రములేనట్టిదేవర లేదు | యిదె హరిముద్రాంకిత మిందే తెలియరో ||
చ|| "అనాయుధాసో అసురా అదేవా" యని | వినోదముగ ఋగ్వేదముదెలిపెడి |
సనాతనము విష్ణుచక్రధారునకును | అనాది ప్రమాణమందే తెలియరో ||
చ|| "యచ్చ యింద్రే" యని "యచ్చ సూర్యే" యని | అచ్చుగ తుదకెక్క నదె పొగడీ శ్రుతి |
ముచ్చట గోవిందుని ముద్రధారణకు | అచ్చమయిన ప్రమాణమందే తెలియరో ||
చ|| మును "నేమినా తప్త ముద్రాం ధారయే" త్తని | వెనువేంకటశ్రుతి యదె వెల్లవిరిసేసీని |
మొనసి శ్రీవేంకటేశు ముద్రధారణకు | అనువుగ బ్రమాణమందే తెలియరో ||
pa|| ade SiraScakramulEnaTTidEvara lEdu | yide harimudrAMkita miMdE teliyarO ||
ca|| "anAyudhAsO asurA adEvA" yani | vinOdamuga RugvEdamudelipeDi |
sanAtanamu viShNucakradhArunakunu | anAdi pramANamaMdE teliyarO ||
ca|| "yacca yiMdrE" yani "yacca sUryE" yani | accuga tudakekka nade pogaDI Sruti |
muccaTa gOviMduni mudradhAraNaku | accamayina pramANamaMdE teliyarO ||
ca|| munu "nEminA tapta mudrAM dhArayE" ttani | venuvEMkaTaSruti yade vellavirisEsIni | monasi SrIvEMkaTESu mudradhAraNaku | anuvuga bramANamaMdE teliyarO ||