ప|| అదె వాడె యిదె వీడె అందు నిందు నేగీని | వెదకి వెదకి తిరువీధులందు దేవుడు ||
చ|| అలసూర్యవీధి నేగీ నాదిత్యునితేరిమిద | కలికికమలానందకరుడుగాన |
తలపోసి అదియును దవ్వు చుట్టరికమని | యిల దేరిమీద నేగీ నిందిరావిభుడు ||
చ|| చక్క సోమవీధి నేగీ జందురునితేరిమీద | యెక్కువైనకువలయహితుడుగాన |
చుక్కలుమోచినదవ్వుచుట్టరిక మిదియని | యిక్కువతో వీధి నేగీ నెన్నికైనదేవుడు ||
చ|| యింతులమనోవీధి నేగీ మరుతేరిమీద- | నంతటా రతిప్రియు డటుగాన |
రంతుల నదియు గానరానిచుట్టరికమని | వింతరీతి నేగీ శ్రీవేంకటాద్రిదేవుడు ||
pa|| ade vADe yide vIDe aMdu niMdu nEgIni | vedaki vedaki tiruvIdhulaMdu dEvuDu ||
ca|| alasUryavIdhi nEgI nAdityunitErimida | kalikikamalAnaMdakaruDugAna |
talapOsi adiyunu davvu cuTTarikamani | yila dErimIda nEgI niMdirAviBuDu ||
ca|| cakka sOmavIdhi nEgI jaMdurunitErimIda | yekkuvainakuvalayahituDugAna | cukkalumOcinadavvucuTTarika midiyani | yikkuvatO vIdhi nEgI nennikainadEvuDu ||
ca|| yiMtulamanOvIdhi nEgI marutErimIda- | naMtaTA ratipriyu DaTugAna |
raMtula nadiyu gAnarAnicuTTarikamani | viMtarIti nEgI SrIvEMkaTAdridEvuDu ||