ప|| అది నాయపరాధ మిది నాయపరాధ- | మదియు నిదియు నాయపరాధము ||
చ|| నెరయ రూపములెల్ల నీరూపమేకా- | నరయనియది నాయపరాధము | పరిపూర్ణుడగునిన్ను బరిచ్ఛిన్నునిగా- |నరయుట యది నాయపరాధము ||
చ|| జీవాత్మునిగా జింతింప దలచుట | యావంక నది నాయపరాధము | సేవించి నిను నాత్మ జింతింపకుండుట | ఆవల నిది నాయపరాధము ||
చ|| ఈడెరగక వేంకటేశుడ నిను గొని- | యాడుట యది నాయపరాధము | యేడ జూచిన నాయెదుర నుండగ నిన్ను- | నాడనీడ వెదకుటపరాధము ||
pa|| adi nAyaparAdha midi nAyaparAdha- | madiyu nidiyu nAyaparAdhamu ||
ca|| neraya rUpamulella nIrUpamEkA- | narayaniyadi nAyaparAdhamu | paripUrNuDaguninnu baricCinnunigA- |narayuTa yadi nAyaparAdhamu ||
ca|| jIvAtmunigA jiMtiMpa dalacuTa | yAvaMka nadi nAyaparAdhamu | sEviMci ninu nAtma jiMtiMpakuMDuTa | Avala nidi nAyaparAdhamu ||
ca|| IDeragaka vEMkaTESuDa ninu goni- | yADuTa yadi nAyaparAdhamu | yEDa jUcina nAyedura nuMDaga ninnu- | nADanIDa vedakuTaparAdhamu ||