ప|| అది బ్రహ్మాణ్డంబిది పిణ్డాణ్డంబు- | దుటు జీవులము వున్నారమిదివో ||
చ|| ఉదయాస్త మయము లొనరిన వలెనే | నిదురలు మేల్కను నిమయములు | కదిసి తిరిసంధ్యా కాలంబులవలె | గుదిగొను దేహికి గుణత్రయములు ||
చ|| పుడమి సస్యములు పొదలిన వలెనే | వొడలి రోగములన్నవివే | ఉడుగని వెలుపటి వుద్యోగమువలె | కొడిసాగెడి మితి కోరికలు ||
చ|| వెలుపలగల శ్రీ వేంకట విభుడే | కలడాతుమలో ఘనుడితడే | చలమున నీతని శరణాగతియే | ఫలమును భాగ్యము బహు సంపదలు ||
pa|| adi brahmANDaMbidi piNDANDaMbu- | duTu jIvulamu vunnAramidivO ||
ca|| udayAsta mayamu lonarina valenE | niduralu mElkanu nimayamulu | kadisi tirisaMdhyA kAlaMbulavale | gudigonu dEhiki guNatrayamulu ||
ca|| puDami sasyamulu podalina valenE | voDali rOgamulannavivE | uDugani velupaTi vudyOgamuvale | koDisAgeDi miti kOrikalu ||
ca|| velupalagala SrI vEMkaTa viBuDE | kalaDAtumalO GanuDitaDE | calamuna nItani SaraNAgatiyE | phalamunu bhAgyamu bahu saMpadalu ||