ప|| ఆదిదేవుం డనంగ మొదల నవతరించి జలధి సొచ్చి | వేదములును శాస్త్రములను వెదకి తెచ్చె నితండు ||
చ|| వాలి తిరుగునట్టి దైత్యవరుల మోహవతులనెల్ల | మూలమూలం ద్రోసి ముసుగుపాలుసేసె నితండు | వేలసంఖ్యనైన సతుల వేడుక లలరంజేసి వొంటి | నాలిమగని రీతిగూడి యనుభవించె నితండు ||
చ|| కడుపులోని జగములనెల్ల గదలకుండం బాపరేని | పడకనొక్క మనసుతోడం బవ్వళించె నితండు |
అడుగు క్రింద లోకమెల్ల నడంచదలంచి గురుతుమీర | పొడవు వెరిగి మిన్నుజలము పొడిచి తెచ్చి నితండు ||
చ|| కొండెవయసువాడు మంచి గోపసతుల మనములెల్ల | ఆడికెలకు నోపి కొల్లలాడి బ్రదికె నితండు |
వేడుకలర వేంకటాద్రి వెలసి భూతకోటి దన్నుం- | జాడుం డనుచు మోక్షపదము చూరవిడిచి నితండు ||
pa|| AdidEvuM DanaMga modala navatariMci jaladhi socci | vEdamulunu SAstramulanu vedaki tecche nitaMDu ||
ca|| vAli tirugunaTTi daityavarula mOhavatulanella | mUlamUlaM drOsi musugupAlusEse nitaMDu |
vElasaMKyanaina satula vEDuka lalaraMjEsi voMTi | nAlimagani rItigUDi yanuBaviMce nitaMDu ||
ca|| kaDupulOni jagamulanella gadalakuMDaM bAparEni | paDakanokka manasutODaM bavvaLiMce nitaMDu |
aDugu kriMda lOkamella naDaMcadalaMci gurutumIra | poDavu verigi minnujalamu poDici tecci nitaMDu ||
ca|| koMDevayasuvADu maMci gOpasatula manamulella | ADikelaku nOpi kollalADi bradike nitaMDu |
vEDukalara vEMkaTAdri velasi BUtakOTi dannuM- | jADuM Danucu mOkShapadamu cUraviDici nitaMDu ||