ప|| అదిగాక నిజమతంబది గాక యాజకం- | బదిగాక హృదయసుఖ మదిగాక పరము ||
చ|| అమలమగు విజ్ఞానమను మహాధ్వరమునకు- | నమరినది సంకల్పమను మహాపశువు | ప్రమదమను యూపగంబమున వికసింపించి | విమలేంద్రియాహుతులు వేల్పంగవలదా ||
చ|| అరయ నిర్మమకార మాచార్యుడై చెలగ | వరుసతో ధర్మదేవత బ్రహ్మ గాగ | దొరకొన్న శమదమాదులు దానధర్మ | భాస్వరగుణాదులు విప్రసమితి గావలదా ||
చ|| తిరువేంకటాచలాధిపు నిజధ్యానంబు | నరులకును సోమపానంబు గావలదా | పరగ నాతనికృపా పరిపూర్ణజలధిలో | నర్హులై యపబృథం బాడంగవలదా ||
pa|| adigAka nijamataMbadi gAka yAjakaM- | badigAka hRudayasuKa madigAka paramu ||
ca|| amalamagu vij~jAnamanu mahAdhvaramunaku- | namarinadi saMkalpamanu mahApaSuvu | pramadamanu yUpagaMbamuna vikasiMpiMci | vimalEMdriyAhutulu vElpaMgavaladA ||
ca|| araya nirmamakAra mAcAryuDai celaga | varusatO dharmadEvata brahma gAga | dorakonna SamadamAdulu dAnadharma | BAsvaraguNAdulu viprasamiti gAvaladA ||
ca|| tiruvEMkaTAcalAdhipu nijadhyAnaMbu | narulakunu sOmapAnaMbu gAvaladA | paraga nAtanikRupA paripUrNajaladhilO | narhulai yapabRuthaM bADaMgavaladA ||