ప|| అడుగరే యాతనినే అంగనలాలా | గుడిగొని తానే వట్టి గొరబాయగాక ||
చ|| యెదురాడేదాననా యెంతటి పనికినైనా | పదరి తానే మారువలికీ గాక |
తుదమీఱేదాననా దూరైయంత దిరిగినా | ముదమునదానే మారుమలసీగాక ||
చ|| కక్కసించే దాననా కడలెంత దొక్కినాను | వెక్కసీడై తానై యిటు వెలసీగాక |
మొక్కలపుదాననా ముందు వెనకెంచితేను | పక్కనె దానె ముంచి పంతమాడీగాక ||
చ|| తడబడేదాననా తనరతి వేళను | బడిబడి దానే చొక్కి భ్రమసీగాక |
అడిగేటి దాననా అందరిలో నన్నుగూడి | అడరి శ్రీవేంకటేశు డాదరించీగాక ||
pa|| aDugarE yAtaninE aMganalAlA | guDigoni tAnE vaTTi gorabAyagAka ||
ca|| yedurADEdAnanA yeMtaTi panikinainA | padari tAnE mAruvalikI gAka | tudamIrxEdAnanA dUraiyaMta diriginA | mudamunadAnE mArumalasIgAka ||
ca|| kakkasiMcE dAnanA kaDaleMta dokkinAnu | vekkasIDai tAnai yiTu velasIgAka | mokkalapudAnanA muMdu venakeMcitEnu | pakkane dAne muMci paMtamADIgAka ||
ca|| taDabaDEdAnanA tanarati vELanu | baDibaDi dAnE cokki BramasIgAka | aDigETi dAnanA aMdarilO nannugUDi | aDari SrIvEMkaTESu DAdariMcIgAka ||