ప|| అట్టివేళ గలగనీ దదివో వివేకము | ముట్టువడితే శాంతము మరి యేలా ||
చ|| జడధులు వొంగినట్టు సందడించు నింద్రియములు | వొడలిలో జీవునికి నొక్కొకవేళ |
బడబాగ్ని రేగినట్లు పైకొనీ ముంగోపము | వుడికించు మననెల్ల నొక్కొకవేళా ||
చ|| అరయ గొండయెత్తినట్టు వేగౌ సంసారము | వూరక కలిమిలేము లొక్కొకవేళ |
మేరలేనిచీకటియై మించును దుఃఖములెల్లా | వూరటలేనికర్మికి నొక్కొకవేళా ||
చ|| పెనుగాలి వీచినట్టు పెక్కుకోరికలు ముంచు | వొనర నజ్ఞానికి నొక్కొకవేళా |
యెనయగ శ్రీవేంకటేశుదాసుడైనదాకా | వునికి బాయవన్నియు నొక్కొకవేళా ||
pa|| aTTivELa galaganI dadivO vivEkamu | muTTuvaDitE SAMtamu mari yElA ||
ca|| jaDadhulu voMginaTTu saMdaDiMcu niMdriyamulu | voDalilO jIvuniki nokkokavELa | baDabAgni rEginaTlu paikonI muMgOpamu | vuDikiMcu mananella nokkokavELA ||
ca|| araya goMDayettinaTTu vEgau saMsAramu | vUraka kalimilEmu lokkokavELa | mEralEnicIkaTiyai miMcunu duHKamulellA | vUraTalEnikarmiki nokkokavELA ||
ca|| penugAli vIcinaTTu pekkukOrikalu muMcu | vonara naj~jAniki nokkokavELA | yenayaga SrIvEMkaTESudAsuDainadAkA | vuniki bAyavanniyu nokkokavELA ||