ప|| అహోబలేశ్వరుడు అఖిల వందితుడు | మహి నితని గొలిచి మనుడిక జనులు ||
చ|| మూడు మూర్తులకు మూలంబీతడు | వేడి ప్రతాపపు విభుడీతడు |
వాడి చక్రాయుధ వరదుండీతడు | పోణిమి పురాణ పురుషు డీతడు ||
చ|| అసురలకెల్ల కాలాంతకు డీతడు | వసుధ దివ్యసింహం బితడు |
విసువని ఏకాంగ వీరుడీతడు | దెసల పరాత్పరతేజం బితడు ||
చ|| నిగిడి శ్రీవేంకట నిలయుడీతడు | బగివాయని శ్రీపతి యీతడు |
సొగసి దాసులకు సులభు డీతడు | తగు ఇహపరముల దాతయు నీతడు ||
pa|| ahObalESvaruDu aKila vaMdituDu | mahi nitani golici manuDika janulu ||
ca|| mUDu mUrtulaku mUlaMbItaDu | vEDi pratApapu viBuDItaDu | vADi cakrAyudha varaduMDItaDu | pONimi purANa puruShu DItaDu ||
ca|| asuralakella kAlAMtaku DItaDu | vasudha divyasiMhaM bitaDu | visuvani EkAMga vIruDItaDu | desala parAtparatEjaM bitaDu ||
ca|| nigiDi SrIvEMkaTa nilayuDItaDu | bagivAyani SrIpati yItaDu |
sogasi dAsulaku sulaBu DItaDu | tagu ihaparamula dAtayu nItaDu ||