ప|| ఆకెవో నాప్రాణ మోహనపు రాణి | దాకొని వేవేలు కాంతలలోన నున్నది ||
చ|| ముదిత కురులనెల్లా ముత్యములు మాణిక్యాలు | గుదిగుచ్చి కలుగంటు గొన్నది |
సదరపు పసిడి వజ్రాలచనుకట్టుది | అదె పైడి పూవుల పయ్యద వల్లెవాటుది ||
చ|| పచ్చలు దాచిన యట్టి పాదుకలు మెట్టినది | లచ్చన మొగవుల మొలనూళ్ళది |
అచ్చపు టుంగరముల అందెలు బాయవట్టాలు | గుచ్చుల ముంజేతుల కంకణ సూడిగేలది ||
చ|| నానాభూషణముల నానా సింగరాల | పానిపట్టి నాదిక్కెతప్పక చూచేది |
ఆనకపుశ్రీ వేంకటాద్రి పతినైన నన్ను | తానె వచ్చి కూడి నాదగ్గరనె వున్నది ||
pa|| AkevO nAprANa mOhanapu rANi | dAkoni vEvElu kAMtalalOna nunnadi ||
ca|| mudita kurulanellA mutyamulu mANikyAlu | gudigucci kalugaMTu gonnadi | sadarapu pasiDi vajrAlacanukaTTudi | ade paiDi pUvula payyada vallevATudi ||
ca|| paccalu dAcina yaTTi pAdukalu meTTinadi | laccana mogavula molanULLadi | accapu TuMgaramula aMdelu bAyavaTTAlu | guccula muMjEtula kaMkaNa sUDigEladi ||
ca|| nAnABUShaNamula nAnA siMgarAla | pAnipaTTi nAdikketappaka cUcEdi | AnakapuSrI vEMkaTAdri patinaina nannu | tAne vacci kUDi nAdaggarane vunnadi ||