ప|| అక్కడ నాపాట్లువడి యిక్కడ నీపాటు పడి | కుక్కనోరికళాసమై కొల్లబోయ బతుకు ||
చ|| ఎండచేత నీడచేత నెల్లవాడు నిట్లానే | బండుబండై యెందు గడపల గానక | వుండగిలి నరకాల నుడుకబోయెద మింక | వండదరిగిన కూరవలెనాయ బతుకు ||
చ|| పంచమహాపాతకాలబారి బడి భవముల | దెంచి తెంచి ముడివేయ దీదీపులై | పొంచినయాసలవెంట బొరలబోయెద మింక | దంచనున్న రోలిపిండితలపాయ బతుకు ||
చ|| యీదచేత వానచేత నెల్లనాడు బాయని | బాదచేత మేలెల్ల బట్టబయలై | గాదిలి వేంకటపతి గానగబోయెద మింక | బీదగరచినబూరె ప్రియమాయ బ్రదుకు ||
pa|| akkaDa nApATluvaDi yikkaDa nIpATu paDi | kukkanOrikaLAsamai kollabOya batuku ||
ca|| eMDacEta nIDacEta nellavADu niTlAnE | baMDubaMDai yeMdu gaDapala gAnaka | vuMDagili narakAla nuDukabOyeda miMka | vaMDadarigina kUravalenAya batuku ||
ca|| paMcamahApAtakAlabAri baDi Bavamula | deMci teMci muDivEya dIdIpulai | poMcinayAsalaveMTa boralabOyeda miMka | daMcanunna rOlipiMDitalapAya batuku ||
ca|| yIdacEta vAnacEta nellanADu bAyani | bAdacEta mElella baTTabayalai | gAdili vEMkaTapati gAnagabOyeda miMka | bIdagaracinabUre priyamAya braduku ||