అక్కటా రావణు బ్రహ్మ హత్య నీకు నేడది పుక్కిట పురాణ లింగ పూజ నీకు నేడది
గురు హత్య బ్రహ్మ హత్యన్ గూడి ద్రోణాచార్యు వంక హరి నీ క్రుప నర్జునుకవి లేవాయ యెరవుగా గల్లలాడి యేచిన ధర్మ రాజునకు పరగ నీ యనుమతిన్ పాపము లేదాయను
అదివో రుద్రుని బ్రహ్మ హత్య బాయన్ గాసి ఇచ్చి పొదలిన నీవతని బూజింతువా అదనన్ పార్వతీదేవి కాతండే నీ మంత్రమిచ్చె వదరు మాటల మాయా వచనాలేమిటికి
తగిలిన నీ నామమే తారక బ్రహ్మమై జగము వారి పాపాలు సంతతమూ బాపన్ గాను మిగుల శ్రీ వేంకటేశ నేడ మీకు పాతకాలు నగున్ బాటు లింతే కాక నానా దేశముల
akkaTaa rAvaNu brahma hatya nIku nEDadi pukkiTa purANa linga pUja nIku nEDadi
guru hatya brahma hatyan gUDi drONAchAryu vamka hari nI krupa narjunukavi lEvAya yeravugaa gallalADi yEchina dharma raajunaku paraga nI yanumatin pApamu lEdAyanu
adivO rudruni brahma hatya bAyan gaasi ichchi podalina nIvatani boojintuvA adanan pArvatIdEvi kAtanDE nI mantramichche vadaru mATala mAyA vachanAlEmiTiki
tagilina nI nAmamE tAraka brahmamai jagamu vaari paapaalu santatamoo baapan gaanu migula SrI vEnkaTESa nEDa mIku paatakaalu nagun baaTu lintE kaaka naanaa dESamula