ప|| అందులోనె వున్నావాడు ఆది మూరితి | అందరాని పదవియైన నందిచ్చు నతడు ||
చ|| ఘనులిండ్ల వాకిళ్ళు కావ బొయ్యే జీవుడా | కని ణీ యాత్మ వాకిలి కావరాదా |
యెనసి పరుల రాజ్య మేలబొయ్యే జీవుడా |అనిశము నీ మనో రాజ్యము నేలరాదా ||
చ|| చెలుల రూపము లెల్ల చింతించే జీవుడా | చెలగి నీ రూప మేదో చింతించ రాదా |
కెలన సుఖములు భోగించేటి జీవుడా | పొలసి సుజ్ఞానము భోగించరాదా ||
చ|| చేవ సంసారాన బలిసిన యట్టి జీవుడా | భావపు టానందాన బలియ రాదా |
కోవరపు సంపదల కోరేటి జీవుడా | శ్రీ వేంకటేశుని సేవగోర రాదా ||
pa|| aMdulOne vunnAvADu Adi mUriti | aMdarAni padaviyaina naMdiccu nataDu ||
ca|| GanuliMDla vAkiLLu kAva boyyE jIvuDA | kani NI yAtma vAkili kAvarAdA |
yenasi parula rAjya mElaboyyE jIvuDA | aniSamu nI manO rAjyamu nElarAdA ||
ca|| celula rUpamu lella ciMtiMcE jIvuDA | celagi nI rUpa mEdO ciMtiMca rAdA |
kelana suKamulu BOgiMcETi jIvuDA | polasi suj~jAnamu BOgiMcarAdA ||
ca|| cEva saMsArAna balisina yaTTi jIvuDA | BAvapu TAnaMdAna baliya rAdA |
kOvarapu saMpadala kOrETi jIvuDA | SrI vEMkaTESuni sEvagOra rAdA ||