ప|| అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ | తమ్మియింట నలరుకొమ్మ ఓయమ్మ ||
చ|| నీరిలోన తల్లడించే నీకే తలవంచీ | నీరికింద పులకించీ నీరమణుండు |
గోరికొన చెమరించీ కోపమే పచరించీ | సారెకు నీయలుక ఇట్టె చాలించవమ్మ ||
చ|| నీకుగానే చెయ్యిచాచీ నిండాకోపమురేచీ | మేకొని నీవిరహాన మేను వెంచీని |
ఈకడాకడి సతుల హృదయమే పెరరేచీ | ఆకు మడిచియ్యనైన ఆనతియ్యవమ్మా ||
చ|| చక్కదనములె పెంచీ సకలము గాలదంచి | నిక్కపు వేంకటేశుడు నీకే పొంచీని |
మక్కువతో అలమేల్మంగ నాంచారమ్మ | అక్కున నాతని నిట్టే అలరించవమ్మ ||
pa|| ammamma Emamma alamElmaMga nAMcAramma | tammiyiMTa nalarukomma Oyamma ||
ca|| nIrilOna tallaDiMcE nIkE talavaMcI | nIrikiMda pulakiMcI nIramaNuMDu |
gOrikona cemariMcI kOpamE pacariMcI | sAreku nIyaluka iTTe cAliMcavamma ||
ca|| nIkugAnE ceyyicAcI niMDAkOpamurEcI | mEkoni nIvirahAna mEnu veMcIni |
IkaDAkaDi satula hRudayamE perarEcI | Aku maDiciyyanaina AnatiyyavammA ||
ca|| cakkadanamule peMcI sakalamu gAladaMci | nikkapu vEMkaTESuDu nIkE poMcIni |
makkuvatO alamElmaMga nAMcAramma | akkuna nAtani niTTE alariMcavamma ||
Sung by:Balakrishna Prasad
|