ప|| అమ్మెడి దొకటి అసిమలోదొకటి | బిమ్మిటి నిందేటిపెద్దలమయ్యా ||
చ|| సంగము మానక శాంతియు గలుగదు | సంగలంపటము సంసారము |
యెంగిలిదేహం బింతకు మూలము | బెంగల మిందేటిపెద్దలమయ్యా ||
చ|| కోరికె లుడుగక కోపం బుడుగదు | కోరకుండ దిక్కువమనసు |
క్రూరత్వమునకు కుదువ యీబ్రదుకు | పేరడి నేమిటిపెద్దలమయ్యా ||
చ|| ఫలము లందితే బంధము వీడదు | ఫలములో తగులు ప్రపంచము |
యిలలో శ్రీవేంకటేశుదాసులము | పిలువగ నేమిటిపెద్దలమయ్యా ||
pa|| ammeDi dokaTi asimalOdokaTi | bimmiTi niMdETipeddalamayyA ||
ca|| saMgamu mAnaka SAMtiyu galugadu | saMgalaMpaTamu saMsAramu |
yeMgilidEhaM biMtaku mUlamu | beMgala miMdETipeddalamayyA ||
ca|| kOrike luDugaka kOpaM buDugadu | kOrakuMDa dikkuvamanasu |
krUratvamunaku kuduva yIbraduku | pEraDi nEmiTipeddalamayyA ||
ca|| Palamu laMditE baMdhamu vIDadu | PalamulO tagulu prapaMcamu |
yilalO SrIvEMkaTESudAsulamu | piluvaga nEmiTipeddalamayyA ||